గోమాంసం అమ్మకానికి తీసుకెళ్తున్న వ్యక్తి అరెస్టు
జయపురం: గోమాంసం విక్రయానికి తీసుకెళ్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. జయపురం సదర్ పోలీసు అధికారి సచిన్ ప్రదాన్ వివరణ ప్రకారం నేటి ఉదయం పోలీసు సబ్‌ఇన్‌స్పెక్టర్ అమీయచరణ్ సాగరియతో పోలీసు టీమ్ పెట్రోలింగ్ జరుపుతుండగా జయపురం సమితి హడియ పంచాయితీ పుట్ర గ్రామ సమీప పండకిగుడ జంక్షన్ వద్ద ఒక వ్యక్తి బైక్‌పై పశుమాంసం తీసుకువెళ్తుండగా కొంత మంది యువకులు పట్టుకున్న సమాచారం అందిన వెంటనే అక్కడకు చేరుకున్నారు. ఆ వ్యక్తిని విచారించగా పశుమాంసం విక్రయానికి తీసుకెళ్తున్నట్లు వెల్లడైంది. అతడు బైక్‌పై తీసుకెళ్తున్న సంచిలో 49 గోమాంసం ప్యాకెట్లు బయటపడగా వాటిని సీజ్ చేసి వ్యక్తిని అరెస్టు చేశారు. ఆ వ్యక్తి బొరిగుమ్మ పోలీసు స్టేషన్ కేవిడి గ్రామం సబసాన్ కులదీప(70) అని వెల్లడించారు. పశు డాక్టర్ సమక్షంలో గోమాంసం నమూనా తీసి పరీక్షించేందుకు భువనేశ్వర్ పంపనున్నట్లు వెల్లడించారు. నిందితుడిని గోహత్య నేరం కింద అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
గోమాంసం అమ్మకానికి తీసుకెళ్తున్న వ్యక్తి అరెస్టు


