నవంబర్ 12న యాదవ మహాసభ
కంచిలి: అఖిల భారత యాదవ మహాసభ సమావేశాన్ని నవంబర్ 12వ తేదీన నిర్వహించనున్నట్లు జిల్లా సంఘ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ నర్తు రామారావు తెలియజేశారు. ఆరోజున సోంపేట పట్టణంలోని వీబీఆర్ కల్యాణ మండపంలో ఉదయం 9 గంటలకు సమావేశం జరుగుతుందన్నారు. ఈ విషయమై కంచిలిలో రాధాకృష్ణ మందిరం ప్రాంగణంలోని సంఘ నేతలతో కలిసి సోమవారం సాయంత్రం సమావేశమయ్యారు. ఈ మహాసభకు జిల్లావ్యాప్తంగా ఉన్న యాదవ సోదరులంతా పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. యాదవుల ఐక్యత వర్థిల్లాలని నినాదాలు చేశారు. సమావేశంలో రాపాక చిన్నారావు, నర్తు ప్రేమ్‌కుమార్, సాలిన లక్ష్మణమూర్తి, ఈశ్వరరావు, జోగారావు, వెంకటరావు, దాలయ్య, రామదాసు, వైకుంఠరావు తదితరులు పాల్గొన్నారు.


