ఘనంగా పరలా నృత్య ఉత్సవాలు
పర్లాకిమిడి: పర్లాకిమిడిలో కళాకారులు అంతర్జాతీయ ఖ్యాతి ఆర్జించారని, వారి కోసం బెత్తగుడ వద్ద ఒక ఓపెన్ ఆడిటోరియం త్వరితగతిన పనులను పూర్తిచేయాలని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోడూరు నారాయణ రావు అన్నారు. స్థానిక రాజవీధిలో అర్బన్ బ్యాంకు గ్రౌండ్స్ వద్ద నాల్గో పరలా ఉత్సవాలను ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ ఉత్సవాలు రెండు రోజులుగా కొనసాగుతుండగా సోమవారం ముగింపు కార్యక్రమానికి త్రిధార (భువనేశ్వర్) గురు డాక్టర్ గజేంద్ర కుమార్ పండా, సెంచూరియన్ విశ్వవిద్యాలయం డైరక్టర్ దుర్గాప్రసాద్ పాఢి, జిల్లా టూరిజం శాఖ అధికారి (ఇన్‌చార్జి) అరుణ్ కుమార్ త్రిపాఠి, మాజీ చైర్మన్ నృసింగ చరణ్ పట్నాయిక్ తదితరులు హాజరయ్యారు. ఈ పరలా నృత్య ఉత్సవాలకు జపాన్ దేశం నుంచి విచ్చేసిన త్రిధాన్ గురు చిసాతో మియురా ఒడిస్సీ నృత్యంలో ప్రేక్షకులను అలరించగా, సోలో కూచిపూడి డ్యాన్సర్ రికో కోజిమా (జపాన్), శ్రీజగన్నాథ ఒడిస్సీ కళాకేంద్రం విద్యార్థులు పాల్గొని అనేక నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. కార్యక్రమం చివర్న గురు గజేంద్ర కుమార్ పండాను జగన్నాథ ఒడిస్సీ కళాకేంద్రం డైరెక్టర్ డి.ప్రియాంక సన్మానించారు. అనంతరం డ్యాన్స్ మాస్టర్ రూపాంజలీ దాస్‌ను జ్ఞాపికను అందజేసి సత్కరించగా, కార్యక్రమాన్ని జిల్లా సాంస్కృతిక శాఖ అధికారిని అర్చనా మంగరాజ్, ముఖ్యవక్తగా ఆదర్శదాస్ విచ్చేసి వ్యవహరించారు.
ఘనంగా పరలా నృత్య ఉత్సవాలు


