 
															ఉత్సాహంగా ముగ్గులు పోటీలు
జయపురం: పవిత్ర కార్తిక మాసం సందర్భంగా స్థానిక ప్రతిమ అంభిక ట్రస్టు ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు సోమవారం నిర్వహించారు. కుంజిబిహారి మందిర ప్రాంగణంలో నిర్వహించిన పోటీలలో జానకీ పాణిగ్రహి, జును పండ, బినోదినీ దాస్ పర్యవేక్షించగా.. మహిళలు, బాలికలు, యువతులు ఉత్సాహంతో పాల్గొన్నారు. వారంతా సంప్రదాయ ముగ్గులు వేశారు. పోటీలు మీనతి పాఢి, రాజేశ్వరి నంద, వందన పట్నాయక్, సుజాత కుమారి పాత్రో, మమత సువార్, పుష్పాంజలీ రథ్, కబిత మంజరి పొలాయ్, కల్యాణి, సుస్మిత, సంధ్యా ప్రధాని, జయలక్ష్మీ మహాపాత్రో, బసంత మిశ్ర,తులసీ పండిత పాల్గొన్నారు. ప్రధమ బహుమతిని మీనతి పాఢి, రెండవ బహుమతిని పుష్పాంజలీ రథ్, మూడో బహుమతి రాజేశ్వరి నంద, కవితమంజరి పొలయ్‌లు దక్కించుకున్నారు. విజేతలకు బహుమతులు, పోటీలలో పాల్గొన్న వారికి ప్రశంసా పత్రాలను ప్రతిమ అంభిక ట్రస్ట్ అధ్యక్షురాలు మమత బెహర అందజేసి సత్కరించారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
