 
															రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
రణస్థలం: లావేరు మండలంలోని తాళ్లవలస జాతీయ రహదారి–16పై కిల్లారి జగదీష్ (28) రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. లావేరు పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. తాళ్లవలస గ్రామానికి చెందిన జగదీష్ తన కోళ్లఫారానికి వెళ్లేందుకు సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో రోడ్డు దాటుతుండగా.. శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. దీంతో జగదీష్ అక్కడికక్కడే మృతి చెందడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. తండ్రి నారాయణరావు తాళ్లవలస గ్రామానికి రోడ్డు అవతల ఉన్న కోళ్లఫారం నడుపుతున్నాడు. తల్లి శశిరేఖ జేఆర్‌పురం పోలీస్‌స్టేషన్ సమీపంలోని గణేష్ కాంప్లెక్స్‌లో పేపర్ ప్లేట్ల వ్యాపారం చేస్తుంటారు. మృతుడికి ఇద్దరు అన్నదమ్ములు హరీష్, యశ్వంత్ ఉన్నారు. జగదీష్ మృతితో తాళ్లవలస గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. లావేరు ఎస్‌ఐ జి.లక్ష్మణరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
 
							రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
