డీఈవో బాధ్యతల స్వీకరణ
జయపురం: కొరాపుట్ జిల్లా విద్యాశాఖాధికారిగా కరుణకర్ భుయె సోమవారం జయపురంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సిబ్బంది ఆయనకు ఘనంగా స్వాగతించారు. స్థానిక బ్లాక్ విద్యాధికారి కార్యాలయంలో ఉద్యోగులు కరుణాకర్‌ను సన్మానించారు. అనంతరం బ్లాక్ ఎడ్యుకేషన్ అధికారి కార్యాలయాన్ని సందర్శించారు. జిల్లా విద్యాధికారిగా బాధ్యతలు చేపట్టి మొదటి సారి కార్యాలయానికి వచ్చిన ఆయనకు బ్లాక్ విద్యాధికారి చందన కుమార్ నాయిక్, విద్యావిభాగ సిబ్బంది పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. వారితో పాటు విద్యాధికారి రాజేంద్ర నారాయణ పాఢీ, జిల్లా అమలా సంఘ అధ్యక్షులు శిశిభూషణ దాస్, విద్యా విభాగ అధికారులు బాల గోపాల మిశ్ర, సాంతను జెన, సమితి విద్యాధికారి కె.గోపాల్, ప్రభుత్వ సమితి విద్యాధికారి సోమనాథ్ గదబ, కిరణ్ మహారాణ, రంజన్ మహంతి, మనోజ్ కుమార్ పట్నాయక్, లిపిస మురళీ సాహు, సునీత నాయిక్, శుభశ్రీ పాత్రో తదితరులు నూతన డీఈవోకు స్వాగతం పలికి దుశ్శాలువతో సత్కరించారు. బ్లాక్ విద్యాధికారి చందన కుమార్ నాయక్ కార్యాలయ ఉద్యోగులను పరిచయం చేశారు.


