రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
రాయగడ: జిల్లాలోని మునిగూడ పోలీసుస్టేషన్ పరిధిలోని బూరుకుగూడ మలుపు వద్ద శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా వారిని బంకిలి గ్రామానికి చెందిన అర్జున్ శికక (23), గోవర్ధన్ గ్రామానికి చెందిన దేవాషిస్ సాహు (24) గా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మునిగూడ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తెలియజేసిన వివరాలు ప్రకారం.. దేవషిస్ బైక్‌పై సమీపంలో గల ఆస్పత్రికి వెళ్తుండగా ఎదురుగా మరో బైక్‌పై అర్జున్ వచ్చి ఎదురెదురుగా ఢీకొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి


