బొయిపరిగుడలో జర్దా ముక్త అభిజాన్
జయపురం: జయపురం సబ్‌డివిజన్ బొయిపరిగుడలో ఆదివారం సమితి స్థాయి తమాకు(జర్దా) ముక్త అభిజాన్ కార్యక్రమం నిర్వహించారు. బొయిపరిగుడ కమ్యూనిటీ ఆస్పత్రి ఇన్‌చార్జి డాక్టర్ బాణువదత్త నాయిక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సమితి స్థాయి తమాకు ముక్త 3.0 సమావేశం జరిగింది. కార్యక్రమంలో తమాకు సేవించటం, అందువల్ల కలిగే ఆనారోగ్య సమస్య లపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా డాక్టర్ నాయిక్ మాట్లాడుతూ తమాకు, దానితో తయారు చేసిన బీడీ వంటివి వినియోగించడ వల్ల పలు వ్యాధులు సంక్రమిస్తాయని, అందువల్ల ప్రభుత్వం తమాకు ముక్త అభిజాన్ 3.0 ప్రారంభించిందని వెల్లడించారు. ఈ అభిజాన్ ఈ నెల 10వ తేదీ నుంచి ప్రారంభమైందని, ఇది 2025 డిసెంబర్ 9 వ తేదీ వరకు నిర్వహిస్తారని వెల్లడించారు. ఈ కార్యక్రమం ద్వారా తమాకు విసర్జణ పై ప్రజలను చైతన్య పరచే కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. బొయిపరిగుడ సమితిని తమాకు ముక్త సమితిగా నిలిపేందుకు సామూహికంగా ఉద్యమించాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆశిష్ కుమార్ భల్, బీపీఎం హెమరాజ్ పాణిగ్రహి, పి.హెచ్.ఇ.ఓ సునీత పట్నాయిక్, బీఏఎం ప్రమోద్ కుమార్ నాయిక్, ఎల్‌టీ సూర్యనారాయణ హొత, హెచ్‌సీడీ అశుతోష్ సాహు, ఎస్‌టిఎస్ సమీర్ గంతాయత్, ఎంఆర్‌ఏ సౌరభ మహంకుడొతో పాటు మహిళ, పురుష మహిళ హెల్త్ వర్కర్లు పాల్గొన్నారు.


