ఉపఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నాయకులు
కొరాపుట్: నువాపడా ఉప ఎన్నికల ప్రచారంలో కొరాపుట్ జిల్లా కాంగ్రెస్ నాయకులు బిజీగా ఉన్నారు. నువాపడా పుర వీధులలో ఆదివారం ఇంటింటి ప్రచారం చేశారు. కొరాపుట్ ఎంపీ సప్తగిరి ఉల్క, కొరాపుట్ జిల్లాకి చెందిన కాంగ్రెస్ శాసన సభా పక్ష నాయకుడు సప్తగిరి ఉల్క, లక్ష్మీపూర్ ఎమ్మెల్యే పవిత్ర శాంత, మల్కన్‌గిరికి చెందిన మంగులు శాంతలు ప్రచారం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి కేవలం కొరాపుట్ ఎంపీ స్థానం మాత్రమే ఉంది. పార్లమెంటరీ పరిధిలో ఏడు ఎమ్మెల్యే స్థానాలుండగా.. ఆరు స్థానాలలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. పంచాయతీలను యూనిట్‌గా తీసుకొని కాంగ్రెస్ నాయకులు అక్కడ మకాం వేశారు.
మోంథా తుఫాన్
హెచ్చరికలు జారీ
భువనేశ్వర్: ముంచుకు వస్తున్న మోంతా తుఫాను నేపథ్యంలో పలు ప్రాంతాలకు వివిధ వర్గాల హెచ్చరికలు జారీ చేశారు.
ఎరుపు హెచ్చరిక:
● అక్టోబర్ 28 నుంచి అక్టోబర్ 29:
మల్కన్‌గిరి,కొరాపుట్,రాయగడ,గజపతి,
గంజాం
●అక్టోబర్ 29 నుండి అక్టోబర్ 30: మల్కన్‌గిరి, కొరాపుట్, నవరంగపూర్, కలహండి, రాయగడ
ఆరెంజ్ హెచ్చరిక
●అక్టోబర్ 27 నుండి అక్టోబర్ 28: మల్కన్‌గిరి, కొరాపుట్, నవరంగపూర్, కలహండి, రాయగడ, గజపతి, గంజాం, కంధమల్.
●అక్టోబర్ 28 నుండి అక్టోబరు 29: నవరంగ్‌పూర్, కలహండి, కంధమల్, నయాగడ్, ఖుర్దా, పూరీ
●అక్టోబర్ 29 నుండి అక్టోబరు 30: నువాపడా, బొలంగీర్, బౌధ్, కంధమల్, గజపతి, గంజాం
ప్రధాని నోట కొరాపుట్ కాఫీ
కొరాపుట్: దేశ ప్రధాని నరేంద్ర మోదీ కొరాపుట్ కాఫీని మెచ్చుకున్నారు. ఆదివారం ప్రధాని మన్ కీ బాత్ 127వ ఎపిసోడ్‌లో మాట్లడారు. ‘ఈ రోజు మన్ కీ బాత్‌లో కాఫీ కోసం ఎందుకు మాట్లాడకూడదు అనిపించింది. దాంతో మాట్లాడాల్సి వచ్చింది. ఈ కాఫీ చాలా అద్భుతంగా ఉంటుంది. కొరాపుట్ కాఫీ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందడం వెనుక అక్కడ గిరిజనుల కృషి ఉంది.’ అన్నారు. కొరాపుట్ కాఫీ ఒడిశా గౌరవంగా అభివర్ణించారు. కొరాపుట్ కాఫీ లాభాలతో పాటు ఇది ఒక అద్భుతమైన జీవన విధానంగా ముందుకు సాగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ కొరాపుట్ కాఫీ రుచి చూడాలని ప్రధాని పిలుపునిచ్చారు. కొరాపుట్ జిల్లాలలో పురాతన కాలంగా గిరిజనులు కాఫీ పంట పండిస్తున్నారు.
ఉపఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నాయకులు
ఉపఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నాయకులు


