తుఫాన్‌పై యంత్రాంగం అప్రమత్తం
మల్కన్‌గిరి: మోంథా తుఫాన్ నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే ఈ నెల 27 నుంచి 30 వరకు ప్రభుత్వ ఉద్యోగుల సెలవులు రద్దు చేశారు. ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని మల్కన్‌గిరి కలెక్టర్ సోమేశ్ ఉపాధ్యాయ్ అదికారులను ఆదేశించారు. ముఖ్యంగా అగ్నిమాపక శాఖ, విద్యుత్‌శాఖ, సరఫరల శాఖ, పోలీసు శాఖలు అలర్ట్‌గా ఉండాలన్నారు. చిత్రకొండ, బొండాఘట్టీ ప్రాంతాల్లో ఎటువంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సౌకర్యాలు కల్పించాలన్నారు. మచిలీపట్నం, కాకినాడ మధ్య తుఫాన్ తీరం దాటే అవకాశం ఉన్నందున, మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి మోటు ప్రాంతం శబరి నదీ సరిహద్దున ఉన్నందున అప్రమత్తమైనట్లు వివరించారు.
తుఫాన్‌పై యంత్రాంగం అప్రమత్తం
తుఫాన్‌పై యంత్రాంగం అప్రమత్తం
తుఫాన్‌పై యంత్రాంగం అప్రమత్తం


