1 నుంచి చెకుముకి సంబరాలు
శ్రీకాకుళం: జిల్లాలో నవంబర్ 1న మండల స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు నిర్వహిస్తున్నట్లు జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గొంటి గిరిధర్, కుప్పిలి కామేశ్వరరావు పిలుపునిచ్చారు. ఆదివారం శ్రీకాకుళంలోని యూటీఎఫ్ భవన్‌లో జనవిజ్ఞాన వేదిక కార్యదర్శి వర్గ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 30 మండలాల్లో ఎంఈఓలు, హెచ్‌ఎంలు, చెకుముకి మండల కన్వీనర్లు, ఉపాధ్యాయులు, సైన్స్ ఉద్యమాభిమానులు, విద్యార్థులు హాజరై సంబరాలు విజయవంతం చేయాలన్నారు. అదే విధంగా నవంబర్ 11 నుంచి 20 వరకు శ్రీకాకుళంలో జరిగే సిక్కోలు పుస్తక మహోత్సవం విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా వ్యవస్థాపక కార్యదర్శి కొత్తకోట అప్పారావు, జిల్లా గౌరవాధ్యక్షులు బొడ్డేపల్లి మోహనరావు, బొడ్డేపల్లి జనార్దనరావు, జిల్లా ఉపాధ్యక్షులు పాలకొండ కూర్మారావు, సైన్స్ అండ్ కమ్యూనికేషన్ జిల్లా కన్వీనర్ హనుమంతు మన్మధరావు, ఎడ్యుకేషన్ సబ్ కమిటీ జిల్లా కన్వీనర్ పాలవలస ధర్మారావు, సమత జిల్లా కన్వీనర్ పేడాడ వేదవతి, ఆడిట్ జిల్లా కన్వీనర్ బి.ఉమామహేశ్వరరావు, యూటీఎఫ్ జిల్లా సహాధ్యక్షులు బి.ధనలక్ష్మి పాల్గొన్నారు.


