చిత్రలేఖన పోటీలకు విశేష స్పందన
జయపురం: ప్రాచీన సంస్కృతి, సంప్రదాయ కళలు, పద్ధతుల పరిరక్షణ లక్ష్యంతో ఏర్పాటు చేసిన జయపురం తరుణ ప్రజ్ఞా భారతి వార్షికోత్సవం సందర్భంగా వివిధ పోటీలు నిర్వహిస్తున్న విషయం విదితమే. ఆదివారం స్థానిక ఎన్.కె.టి రోడ్డు నారాయణి ఆంగ్ల పాఠశాల ప్రాంగణంలో ప్రాచీణ ప్రబంధాలు, చారిత్రిక విషయాలు, చిత్ర లేఖనం పోటీలను సీనియర్, జూనియర్ విభాగాల్లో నిర్వహించారు. ఈ పోటీల్లో అనేక పాఠశాలలు, కళాశాలలు, విశ్వ విద్యాలయాల నుంచి విద్యార్థులు పాల్గొన్నారు. తరుణ ప్రజ్ఞా భారతి జయపురం అధ్యక్షుడు తపన్ కిరణ్ త్రిపాఠీ, ఉపాధ్యక్షుడు రామ శంకర షొడంగి, సాధారణ కార్యదర్శి అజయ్ కుమార్ మల్లిక్, కోశాధికారి రవీంధ్ర మహరాణ, సభ్యులు జానకి పాణిగ్రహి, సబిత త్రిపాఠీ, లిపికా దొలాయి, జగన్నాథ్ పాణిగ్రహి, క్షిరోద్ దాస్, క్షేత్ర మోహన్ నాయక్ పోటీలను పర్యవేక్షించారు. నవంబర్ 2వ తేదీన స్థానిక నారాయణి ఆంగ్ల పాఠశాల మైదానంలో ఉదయం 7.30 గంటల నుంచి విలువిద్య, పరుగు పందెం, కబడ్డీ పోటీలతో పాటు, పిల్లలకు పాటల పోటీలు నిర్వహించనున్నట్లు అధ్యక్షుడు తపన్ కిరణ్ త్రిపాఠీ వెల్లడించారు. తాము నిర్వహించిన పోటీల్లో ఏ పాఠశాల విద్యార్థులు ఎక్కువ బహుమతులు గెలుచుకుంటారో ఆ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడిని తరుణ ప్రజ్ఞా భారతి వార్షికోత్సవంలో ఘనంగా సన్మానిస్తామని ప్రకటించారు.
చిత్రలేఖన పోటీలకు విశేష స్పందన
చిత్రలేఖన పోటీలకు విశేష స్పందన


