రాష్ట్రస్థాయి భగవద్గీత పోటీలకు విద్యార్థుల ఎంపిక
నరసన్నపేట: భగవద్గీతలోని 15వ అధ్యాయంలో శ్లోకాల పఠనంపై జిల్లా స్థాయిలో నిర్వహించిన పోటీల్లో ఆరుగురిని రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తున్నట్లు చిన్మయిమిషన్–చిన్మయి సుగుణం స్థానిక ఆశ్రమం స్వామీజీ పరమాత్మానంద ఆదివారం తెలిపారు. నరసన్నపేట శాఖ ఆధ్వర్యంలో మండల స్థాయిలో పోటీలు నిర్వహించగా 44 పాఠశాలల నుంచి 4500 మంది పాల్గొనగా జిల్లా స్థాయికి 120 మంది ఎంపికయ్యారని చెప్పారు. వీరికి ఆదివారం నరసన్నపేటలో పోటీలు నిర్వహించి వివిధ విభాగాల్లో ప్రతిభ చూపిన 16 మందిని ఎంపిక చేశామన్నారు.
వీరిలో ఆరుగురు దేవశ్యగౌతమి, పి.సుసాధ్య, ఏ.నైషిత, ఏ.జాహ్నవి, వి.గీత, ఎం.శివాణి నవంబర్ 9న కడపలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.


