ఆదిత్యున్ని దర్శించుకున్న హైకోర్టు జడ్జిలు
అరసవల్లి/గార: అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారిని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి సత్తి, జస్టిస్ గేదెల తుహీన్‌కుమార్ శనివారం దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం అధికారులు, ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ తదితరులంతా పూర్ణకుంభ స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించారు. న్యాయమూర్తులకు జ్ఞాపికలు అందజేశారు. అనంతరం శ్రీకూర్మంలో కూర్మనాథున్ని దర్శించుకున్నారు. కార్యక్రమంలో అర్చకులు ఇప్పిలి రంజిత్ శర్మ, ఇప్పిలి సాందీప్‌శర్మ, ఇప్పిలి షణ్ముఖశర్మ తదితరులు పాల్గొన్నారు. శ్రీకూర్మంలో జరిగిన కార్యక్రమంలో ఈఓ కోట నరసింహనాయుడు, అర్చకులు లక్ష్మణాచార్యులు, కిషోర్‌బాబు పాల్గొన్నారు.


