జాగ్రత్త
న్యూస్‌రీల్
శుక్రవారం శ్రీ 24 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
సైబర్ నేరగాళ్లతో..
పర్లాకిమిడి:
సైబర్ నేరాల నుంచి మనం సురక్షితంగా ఉండేందుకు మొబైల్స్‌కు వచ్చే ఏపీకే ఫైల్స్, సోషల్ మీడియా, తెలియని ఫోన్‌కాల్స్, ఆన్‌లైన్‌లో వివిధ వస్తువులు కోనుగోళ్లలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ జ్యోతింద్ర కుమార పండా అన్నారు. స్థానిక కాలేజ్ జంక్షన్ గుండిచామందిరం వద్ద గురువారం సాయంత్రం ‘సైబర్ సెక్యూరిటీ అభిజాన్ ప్రచారం– 2025’ను కలెక్టర్ మధుమిత ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ పబ్లిక్ ప్రచార సభకు జిల్లా అటవీ శాఖ అధికారి కె.నాగరాజు, యునైటెడ్ బ్యాంకు ప్రాంతీయ డైరక్టర్ ఆర్.సరక, శ్రీ కృష్ణచంద్ర గజపతి కళాశాల ప్రిన్సిపల్ రాధాకాంత భుయ్యాన్, డీఈఓ డాక్టర్ మయాధార్ సాహు, మహిళా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మహేంద్ర తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ పండా మాట్లాడుతూ, సైబర్ సురక్షిత ప్రచారం ఈనెల 18 నుంచి నవంబరు 17 వరకూ జిల్లా వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నామని, ఎవరైనా డబ్బులు పోగొట్టుకున్న సమయంలో జిల్లా ఎస్పీ కార్యాలయంలో సైబర్ డెస్క్‌లో ఫిర్యాదు చేయాలని కోరారు. గత రెండేళ్లుగా సైబర్ నేరాలు అరికట్టడానికి తగు సాఫ్ట్‌వేర్ టూల్స్ లేనికారణంగా అభియోగాలు పరిష్కరించలేకపోయామని, ప్రస్తుతం సైబర్ నేరాల సంఖ్య పెరిగిన దృష్ట్యా ప్రజల అభియోగాలు స్వీకరిస్తున్నామని అన్నారు. అనంతరం కలెక్టర్ మధుమిత మాట్లాడుతూ, వ్యక్తిగత సమాచారం సోషల్ మీడియాలో జతచేయరాదని, తక్కువ వడ్డీలకు రుణాలు అందజేస్తామన్న సైబర్ నేరగాళ్ల వలలో పడరాదని, ఏటీఎంల వద్ద డెబిట్, క్రెడిట్ కార్డులను అపరిచిత వ్యక్తులకు ఇచ్చి డబ్బులు పోగొట్టుకోకుండా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. సైబర్ మోసాలకు గురైన వారు టోల్ ఫ్రీ నంబర్ 1930 కు తక్షణమే ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సైబర్ నిపుణుడు డాక్టర్ డి.ఈశ్వరరావు అన్నారు. ఈ సమావేశంలో సైబర్ నేరాలు అరికట్టే మస్కట్‌ను అధికారులు ఆవిష్కరించారు.
సైబర్ సురక్షిత ప్రచారసభలో మాట్లాడుతున్న
ఎస్పీ జ్యోతింద్ర కుమార్ పండా
సైబర్ నేరాలను అరికట్టే మస్కట్‌తో జిల్లా అధికారులు
నువాపడా ఉప ఎన్నిక
జాగ్రత్త
జాగ్రత్త
జాగ్రత్త
జాగ్రత్త
జాగ్రత్త


