నెట్‌వర్క్ పట్టి
కొండపైకి ఎక్కి..
మల్కన్‌గిరి : మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ సమితిలో మొత్తం 9 పంచాయతీలు జోడాం, పనాస్‌పూట్, రల్లేగేఢ, పప్పారమేట్ల, గాజుల్‌మామ్ముడి, కూర్మానూర్, బోఢపోఢ, బోఢపోధర్, దూలిపూట్ ఉన్నాయి. వీటిలో 151 గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ మొబైల్ సేవల కోసం 30 సెల్ టవర్లు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెప్పింది. స్మార్ట్‌ఫోన్లు కూడా గత ప్రభుత్వం ఇచ్చింది. కానీ నెట్‌వర్క్ లేకపోవడంతో అవన్నీ దిష్టి బొమ్మల్లా మిగిలాయి. ఇక పంచాయతీ కార్యాలయ పనులు కూడా కొండెక్కితే గానీ జరగడం లేదు. గురువారం రల్లేగేఢ పంచాయతీ పనుల కోసం ఆధార్ కార్డు, పీఎం కిసాన్, కేవైసీ వంటి వాటి కోసం అధికారులు కొండపైకి ఎక్కి సాయంత్రం వరకు అక్కడే పనిచేశారు.
నెట్‌వర్క్ పట్టి


