మల్కన్‌గిరి : మల్కన్‌గిరి జిల్లా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం జిల్లా స్థాయి విజ్ఞాన నాటక పోటీలను నిర్వహించారు. మానవ సంక్షేమంలో విజ్ఞాన శాస్త్రం అనే అంశంపై నాటకం ప్రదర్శించారు. కార్యక్రమంలో శ్రీశరత్‌రౌత్, జిల్లా సైన్స్ ఇన్‌స్పెక్టర్, ప్రధాన ఉపాధ్యాయురాలు మమతా స్వాయి సంయుక్తంగా ప్రారంభించారు. ఉత్సవంలో ముఖ్య అతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి చిత్తరంజానన్ పాణిగ్రహి పాల్గొన్నారు. విద్యార్థుల్లో విజ్ఞానం పెరిగేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. మల్కన్‌గిరి ఉన్నత పాఠశాలకు ప్రథమ స్థానం, కలిమెల సమితి ఎంవీ 79 పాఠశాలకు ద్వితీయ స్థానం, బలిమెల ప్రభుత్వ పాఠశాలకు తృతీయ స్థానాలు దక్కాయి. చిత్రకొండ సమితి ఆర్‌ఎస్‌సి 6 గ్రామానికి లలితా ఖీలోకు ప్రత్యేక బహుమతి అందజేశారు.
నాటకాన్ని ప్రదర్శిస్తున్న మల్కన్‌గిరి పాఠశాల
విద్యార్థులు
జిల్లా స్థాయి విజ్ఞాన నాటక పోటీ నిర్వహణ
జిల్లా స్థాయి విజ్ఞాన నాటక పోటీ నిర్వహణ
జిల్లా స్థాయి విజ్ఞాన నాటక పోటీ నిర్వహణ


