సహకార పాలసీ డ్రాఫ్ట్‌పై వర్క్‌షాప్
–10లోu
కాళీమాత పూజలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
గుమ్మా బ్లాక్ చతువా కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఆహారం తయారు చేసే కేంద్రాలు పరిశీలించారు.
జయపురం: ఒడిశా రాష్ట్ర ప్రథమ నూతన సహకార పాలసీ–2025 డ్రాఫ్ట్ కమిటీ ప్రాంతీయ స్థాయి వర్క్‌షాపు గురువారం జయపురం సంధ్యా ఫంక్షన్ హాల్‌లో నిర్వహించారు. ఈ వర్క్‌షాపులో కొరాపుట్, రాయగడ, మల్కన్‌గిరి, నవరంగపూర్, కలహండి జిల్లాల్లోని సహకార రంగ సభ్యులు పాల్గొన్నారు. వర్క్‌షాపులో కొరాపుట్ కలెక్టర్ మనోజ్ సత్యబాన్ మహజన్, కొరాపుట్ ఎమ్మెల్యే రఘురాం మచ్చ, భవాణీపట్న సెంట్రల్ కోఆపరేటిక్ బ్యాంక్ అధ్యక్షుడు గిరీష్ బెహరా, కొరాపుట్ కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షుడు ఈశ్వర చరణ పాణిగ్రహి, రాష్ట్ర సహకార పాలసీ–2025 డ్రాఫ్ట్ కమిటీ సభ్యులు ఫ్రొఫెసర్ హరేకృష్ణ మిశ్ర, గోపబందు శతపతి, కొరాపుట్ డీఆర్‌సీసీఎస్ మోనిక రాయ్, జాయింట్ కార్యదర్శి సంగ్రామ కేశరి రౌత్ తదితరులు రాష్ట్ర సహకార ఉద్యమం, నూతన సహకార పాలసీ 2025 పై ప్రసంగించారు. వర్క్‌షాపులో పాల్గొన్న వారు నూతన సహకార పాలసీపై తమ అభిప్రాయాలు తెలియజేశారు. కార్యక్రమంలో రాధా వినోద్ సామంతరాయ్, కొరాపుట్ కేంద్ర సహకార బ్యాంక్ పరిచాలన కమిటీ మాజీ అధ్యక్షురాలు శ్రీమతి ఇందిర నందో, మాజీ డైరెక్టర్ బిరేన్ మోహణ పట్నాయిక్, కేసీసీ బ్యాంక్ సీనియర్ డైరెక్టర్ రమాకాంత రౌళో, డైరెక్టర్ ఝడేశ్వర ఖడంగ, మిటు పాత్ర, అరుణ భొటొమిశ్ర, బిపద మండల్, కర్పూర హంతాల్, చిత్తరంజన్ ప్రధాన్, అమరలాల్ అహుజ, సుకాంత త్రిపాఠీ తదితరులు తమ అభిప్రాయాలు తెలిపారు.
సహకార పాలసీ డ్రాఫ్ట్‌పై వర్క్‌షాప్
సహకార పాలసీ డ్రాఫ్ట్‌పై వర్క్‌షాప్


