సైబర్ భద్రత అవగాహన
మల్కన్‌గిరి : మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి ఎంవీ 79 పోలీసు స్టేషన్‌లో సైబర్ భద్రతపై ఐఐసీ చంద్రకాంత్ అవగాహన కల్పించారు. మోసాల గురించి ప్రజలకు వివరించేందుకు ఈ నెల 18 నుంచి నవంబర్ 17వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఫేస్‌బుక్, వాట్సాప్ మోసాలు, బ్యాంక్ ఫ్రాడ్లు, తెలియని లింక్‌లపై క్లిక్ చేయకూడదని, వ్యక్తిగత సమాచారాన్ని ఆన్‌లైన్‌లో పంచుకోవద్దని, సందేహాస్పద చర్యలు కనిపిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. అలానే మోసాల బారిన పడకుండా ఉండేందుకు, సైబర్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కు కాల్ చేయవచ్చని పేర్కొన్నారు.


