 
															ఫేక్ వెబ్ చానెళ్లపై చర్యలు తీసుకోవాలి
కొరాపుట్: ఫేక్ వెబ్ చానళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కొరాపుట్ డీసీసీ ప్రెసిడెంట్ రూపక్ తురుక్ డిమాండ్ చేశారు. గురువారం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. కొరాపుట్ జిల్లా కేంద్రంలో రూపక్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ పిలుపుమేరకు ప్రతి జిల్లాలోనూ ఫేక్ వెబ్ చానల్స్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నామన్నారు. తమ పార్టీ నాయకులను లక్ష్యంగా పెట్టుకొని తప్పడు ప్రసారాలు చేస్తున్నాయన్నారు. ఇటువంటి వాటిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం సైబర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పార్టీ సీనియర్ నాయకుడు మనోజ్ ఆచార్య పాల్గొన్నారు.
మల్కన్‌గిరిలో..
మల్కన్‌గిరి: పీసీసీ అధ్యక్షుడు భక్తచరణ దాస్ పేరుతో నిరాధార వార్తలు, వ్యాఖ్యలు వైరల్ చేస్తున్న ఫేక్ వెబ్ చానళ్లపై చర్యలు తీసుకోవాలని జిల్లా కంగ్రెస్ అధ్యక్షుడు జి.శ్రీనివాసురావు డిమాండ్ చేశారు. గురువారం మల్కన్‌గిరి ఆదర్శ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జిల్లా పరిషత్ సభ్యుడు కృష్ణచంద్ర అనుగు, కాంగ్రెస్ నేతలు భీమా బార్ష, రామకృష్ణ మండల్, దశరధి దురక, భాస్కర్ పర్చా, పద్మా పాంగి, చిన్నరావు, ప్రభాకర్ పాల్, ఇతర సభ్యులు పాల్గొన్నారు. జిల్లా కాంగ్రెస్ భవన్ నుంచి ర్యాలీ నిర్వహించారు.
 
							ఫేక్ వెబ్ చానెళ్లపై చర్యలు తీసుకోవాలి
 
							ఫేక్ వెబ్ చానెళ్లపై చర్యలు తీసుకోవాలి

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
