ఘనంగా కాళీమాత పూజలు
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో కాళీ మాతకు గురువారం ప్రత్యేక పూజాలు నిర్వహించారు. ఈ పూజను బెంగాళీ సంప్రదయంలో జగన్నాథ్‌పల్లి గ్రామంలో మా పోలీ మాంగళరూపాంలో సర్వజననీ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. కోరుకొండ, మాత్తిలి, డ్యామ్‌సైడ్, కలిమెల, పోడియ, ఎం.వి 43 గ్రామాల్లో అమ్మావారి ముర్తులను నిలిపి పూజలు చేస్తున్నారు. ప్రతి మండపం వద్ద బెంగాళీ సంప్రదాయ భజనలు నిర్వహిస్తున్నారు.
చతువా కేంద్రం తనిఖీ
పర్లాకిమిడి: గజపతి జిల్లాలో గుమ్మా బ్లాక్‌లో పలు చతువా ఉత్పాదక కేంద్రాలను సబ్ కలెక్టర్ అనుప్ పండా గురువారం సందర్శించారు. గర్భిణులు, బాలింతలకు అంగన్‌వాడీ కేంద్రాల్లో అందజేసే పోషక విలువలు ఉన్న డ్రై ఫుడ్ (చతువా)ను సరైన పధ్ధతిలో తయారుచేసే రెండు కేంద్రాలను తనిఖీ చేశారు. సబ్ డివిజనల్ ప్రోగ్రాం అధికారి స్నిగ్దారాణి భుయ్యాన్, సీడీపీఓ పుష్పాంజలి సాహు, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
జలుమూరు: కార్తిక మాసంలో శ్రీముఖలింగం రాలేని భక్తులకు వారి గోత్రనామాలు వాట్సాప్ ద్వారా తెలియజేస్తే ఉచితంగా పూజలు నిర్వహిస్తామని అనువంశక అర్చకులు నాయుడుగా రి రాజశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. జన్మనక్షత్ర, గ్రహదోషాలు పోవడానికి ఉచిత పూజలు చేస్తామని, దీనికోసం ఎటువంటి రుసుం చెల్లించనవసరం లేదని పేర్కొన్నారు. ఆసక్తిగల భక్తు లు 9493577098 నంబర్‌కు వాట్సాప్ ద్వారా వివరాలు తెలియజేయాలని కోరారు.
14న బాలల సంఘం
రాష్ట్ర సమ్మేళనం
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): నవంబర్ 14న జరి గే బాలల సంఘం రాష్ట్ర సమ్మేళనం విజయవంతం చేయాలని అఖిల భారత యువజన సమా ఖ్య (ఏఐవైఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు మొజ్జాడ యుగంధర్ కోరారు. ఈ మేరకు శ్రీకాకుళం క్రాంతిభవన్‌లో గురువారం పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ రోజురోజుకూ పెరుగుతోందన్నారు. పేరుకు చట్టాలు ఉన్నా యి తప్ప బాలకార్మికుల నియంత్రణ జరగడంలేదన్నారు. బాల్య వివాహాలు జరుగుతున్నా నియంత్రణ కరువైందన్నారు. ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొత్స సంతోష్, కొన్న శ్రీనివాస్‌లు మాట్లాడుతూ నేటి సమాజంలో బాలలు గంజాయి, మత్తు పదార్థాలకు బానిసలుగా మారి భవిష్యత్తును దూరం చేసుకుంటు న్న నేపథ్యంలో రాష్ట్ర యువజన సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సంఘ నాయకులు గిరిబాబు, సురేష్, వెంకట రావు తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా కాళీమాత పూజలు
ఘనంగా కాళీమాత పూజలు


