సైబర్ నేరాలపై అప్రమత్తం
పర్లాకిమిడి:
జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, గజపతి జిల్లాలో ఆర్.ఉదయగిరి బ్లాక్‌లో అనుగురు పంచాయతీ, రామగిరి గుమ్మాలో బుభునీ పంచాయతీ, కాశీనగర్ బ్లాకులోని పలు పంచాయతీల్లో సైబర్ నేరాలపై అవగాహన ర్యాలీలు, పలు తహసీల్దార్ కార్యాలయాల్లో సభలను పోలీసు అధికారులు బుధవారం నిర్వహించారు. గుర్తుతెలియని వారికి ఏటీఎం పిన్ నంబర్ ఇవ్వడం, తెలియని లింకులు ఓపెన్ చేయడం వల్ల డబ్బులు పోవడం వంటివి జరుగుతున్నాయని ఎస్.డి.పి.ఒ అమితాబ్ పండా అన్నారు. ఆధార్, ఏటీఎం కార్డులు అప్‌డేట్ చేస్తామని ఫేక్ యాప్, మేసేజ్‌లు వస్తాయని, ఓ.టీ.పీ చెబితే డబ్బులు అకౌంట్ నుంచి మాయమవుతాయన్నారు. ఇటువంటి సంఘటనలు జరిగితే 1930కు వెంటనే రిపోర్టు చేయాలని, సంబంధిత బ్యాంకు మేనేజర్ ఫిర్యాదు ఇవ్వాలన్నారు.
సైబర్ నేరాలపై అప్రమత్తం
సైబర్ నేరాలపై అప్రమత్తం


