ఘనంగా మా శ్యామకాళీ ఉత్సవాలు
పర్లాకిమిడి: స్థానిక ఐదో వార్డు కటిక వీధి జంక్షన్ వద్ద మా శ్యామకాళీ పూజా వేడుకలు ఘనంగా బుధవారం ఘనంగా జరిగాయి. మహిళలు పెద్ద ఎత్తున కాళీని దర్శించుకుని దీపారాధన చేపట్టారు. పోరుగు రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం, కోరసవాడ నుంచి కూడా భక్తులు వచ్చారు. గత 28 సంవంత్సరాలుగా పర్లాకిమిడిలో మాశ్యామ కాళీ ఉత్సవాలు జరుపుతున్నట్టు కమిటీ కార్యదర్శి బి.బి.మహాంతి తెలియజేశారు.
సైబర్ భద్రత అవగాహన
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి ఎం.వి 79 పోలీసు స్టేషన్‌లో బుధవారం సైబర్ భద్రతపై అవగాహన కర్యక్రమాన్ని ఐఐసీ చంద్రాకాంత్ తండి నిర్వహించారు. ప్రస్తుతం జరుగుతున్న మోసలు గూర్చి ప్రజాల్లో చైతన్యం కల్పించడం కోసం ఈ కర్యక్రమాన్ని ఈ నెల 18 నుంచి నవంబర్ 17వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. ఫేస్‌బుక్, వాట్సాప్ మోసాలను వివరించారు. తెలియని లింక్‌లపై క్లిక్ చేయకూడదని, వ్యక్తిగత సమాచారాన్ని ఆన్‌లైన్‌లో పంచుకోవద్దుని, అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. మోసాల బారిన పడకుండా ఉండేందుకు, సైబర్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కు ఫోన్ చేయాలని ఐఐసీ చంద్రకాంత్ తండి తెలిపారు.
ఘనంగా మా శ్యామకాళీ ఉత్సవాలు


