
చెస్ పోటీల పోస్టర్ ఆవిష్కరణ
టెక్కలి: ఆలిండియా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 26న టెక్కలిలో నిర్వహించనున్న జిల్లాస్థాయి చెస్ పోటీల పోస్టర్‌ను ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి ఆధ్వర్యంలో మంగళవారం ఆవిష్కరించారు. స్థానిక ఆల్ఫాజెన్ పాఠశాలలో నిర్వహించనున్న పోటీలను క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని ఆలిండియా చెస్ ఫెడరేషన్ సభ్యుడు ఎస్.భీమారావు, జిల్లా సభ్యుడు ఐ.అవినాష్ కోరారు.
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
శ్రీకాకుళం క్రైమ్: జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కాంప్లెక్సు వద్ద స్పృహ లేకుండా పడివున్న వ్యక్తిని రిమ్స్‌లో చేర్పించగా, చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు రెండో పట్టణ సీఐ ఈశ్వరరావు తెలిపారు. ఈనెల 19న ఆర్టీసీ కాంప్లెక్సు వద్ద ఎటువంటి గాయాలు లేకుండా స్పృహ లేకుండా శృంగవరపు సూర్యనారాయణ (55) పడి ఉండటాన్ని చూసిన స్థానికులు రిమ్స్‌కు తరలించారన్నారు. ఏ గ్రామస్తుడో తెలియనందున తెలిసినవారు స్టేషన్‌కు సమాచారమివ్వాలని, లేదంటే 63099 90824 నంబర్‌కు డయల్ చేసి తెలియజేయాలన్నారు.