మల్కన్‌గిరి సబ్ జైల్‌లో దీపావళి సంబరాలు
మిఠాయిలు అందజేస్తున్న అధికారులు
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కేంద్రంలోని సబ్ జైల్లో సోమవారం రాత్రి దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జైల్ సూపరింటెండెంట్ దిలీప్ కుమార్ బెహర ఆధ్వర్యంలో 600 మంది ఖైదీలు ఉత్సవంలో పాల్గొన్నారు. ముందుగా లక్ష్మీ పూజను నిర్వహించి ఖైదీలకు స్వీట్లు ,పండ్లు పంపిణి చేశారు . అనంతరం ఖైదీల మధ్య కవితలు పోటీలు, నాటకం వేసి ఉత్సాహ పరిచారు. ఈ సందర్భంగా జల్ సూపరింటెండెంట్ దిలీప్‌కుమార్ మాట్లాడుతూ.. దీపావళి వెలుగు చీకట్లను పోగొట్టినట్టే ప్రతి వ్యక్తి తన జీవితంలో కొత్త వెలుగులు తీసుకురావాలన్నారు. ఖైదీలు సరికొత్త ఆరంభానికి సన్నద్ధమవ్వాలని ఆకాంక్షించారు.


