
మొక్కలతోనే మనుగడ
మల్కన్‌గిరి: మొక్కలతోనే మానవ, జీవరాశుల మనుగడ సాధ్యమని వక్తలు అన్నారు. మల్కన్‌గిరి జిల్లా కోరుకొండ సమితి చితాపారి పంచాయతీ విరకిశోరపూర్ గ్రామంలో పర్యావరణవేత్త దీపారాణి నాయక్ పర్యవేక్షణలో యువజన సంఘం సంయుక్త ఆధ్వర్యంలో సంఘ అధ్యక్షుడు జగన్నాథ్ హంతాల్ నేతృత్వంలో వంద మొక్కలను మంగళవారం నాటారు ముఖ్యఅతిథిగా చిత్రకొండ బీఈవో గాయత్రీ దేవి, కండేల్ ఉన్నత ప్రాధమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు బసంత్ కుమార్ రాణా ఇతర సిబ్బంది పాల్గొని వివిధ ఔషధ మొక్కలు నాటారు. సందర్భంగా పర్యావేరణవేత్త దీపారాణి మాట్లాడుతూ.. బాణసంచాతో పర్యావరణాన్ని కాలుష్యం చేయటం కంటే మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలన్నారు.

మొక్కలతోనే మనుగడ