
అమరవీరుల త్యాగాలను జాతి మరవదు
పర్లాకిమిడి: గజపతి జిల్లా బెత్తగుడ పోలీసు గ్రౌండ్స్‌లో మంగళవారం పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహించారు. జిల్లా ఎస్పీ జ్యోతింద్ర పండా ముఖ్యఅథిగా విచ్చేశారు. అమరవీరుల స్థూపం వద్ద రిజర్వ్‌డ్ ఇన్‌స్పెక్టర్ ప్యారెడ్ కమాండెంట్ నిరంజన్‌నాయక్, రెండో కమాండెంట్ ఖుసిరాం భుయి పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. గజపతి జిల్లాలో విధి నిర్వహణలో వివిధ సంఘటనల్లో అమరవీరులైన జవాన్లకు ఎస్పీ అంజలి ఘటించారు. రాష్ట్ర గవర్నర్, హోంశాఖ మంత్రి పంపిన సందేశాన్ని ఎస్పీ చదివి వినిపించారు. ప్యారెడ్ కమాండెంట్, పోలీసు బెటాలియన్ల గౌరవ వందనాన్ని ఎస్పీ స్వీకరించారు. 2008లో మల్కన్‌గిరి జిల్లాలో మషైరా వద్ద మావోయిస్టుల ఎదురు కాల్పుల్లో వీరమరణం చెందిన ఇద్దరు జవాన్లు సింహాచల ప్రధాన్, బిశ్వజిత్ జెన్నా కుటుంబ సభ్యులను ఎస్పీ సత్కరించారు. 3వ ఎస్.ఎస్ కమాండెంట్ అశోక్ కుమార్ మహంతి, డీఎస్పీ అమితాబ్ పండా, ఎస్‌డీపీఓ మాధవానంద నాయక్, 3వ బెటాలియన్ ట్రైనర్ కందర్ప పాత్రో, తదితరులు పాల్గొన్నారు.
నబరంగ్‌పూర్‌లో..
కొరాపుట్: పోలీస్ అమరుల బలి దానాలు జాతి మరవదని నబరంగ్‌పూర్ జిల్లా ఎస్పీ మడకర్ సందీప్ సంపత్ ప్రకటించారు. మంగళవారం పోలీసు అమరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రంలోని జానకీనగర్‌లో గల పోలీస్ రిజర్వ్ గ్రౌండ్స్‌లో సాయుధ బలగాలను ఉద్దేశించి ప్రసంగించారు. అమరుడైన ప్రతి పోలీసు తన విధి నిర్వహణ కోసం ప్రాణత్యాగం చేయడం జాతి కోసం చేసిన త్యాగమన్నారు. ఈ ఏడాది దేశ వ్యాప్తంగా 191 మంది పోలీసులు విధి నిర్వహణలో మృతి చెందారని చదివి వినిపించారు. ఒడిశాలో ఇద్దరు పోలీసులు బలి దానాలు చేశారన్నారు. ఒడిశా గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు, ముఖ్యమంత్రి మొహన్ చరణ్ మజ్జిల సందేశాలను చదివి వినిపించారు. జిల్లాకు చెందిన ప్రశాంత్ పాత్రో మావోయిస్టుల కాల్పల్లో మృతి చెందడంతో అతని చిత్రపటం వద్ద నివాళులర్పించారు. ఏఎస్పీ, డీఎస్పీ, ఎస్‌డీపీఓలు పాల్గొన్నారు.

అమరవీరుల త్యాగాలను జాతి మరవదు

అమరవీరుల త్యాగాలను జాతి మరవదు

అమరవీరుల త్యాగాలను జాతి మరవదు