రూ.50 లక్షల బీమా అందజేత | - | Sakshi
Sakshi News home page

రూ.50 లక్షల బీమా అందజేత

Oct 22 2025 6:45 AM | Updated on Oct 22 2025 6:45 AM

రూ.50

రూ.50 లక్షల బీమా అందజేత

నరసన్నపేట: భారతీయ స్టేట్‌ బ్యాంకు ఖాతాదారులకు ప్రమాద బీమా కల్పిస్తున్నామని, దీంట్లో భాగంగా లుకలాంకు చెందిన మాజీ సైనికుడు బొత్స శ్రీరాములు కుటుంబానికి ప్రమాద బీమా రూ.50 లక్షలు మంజూరయ్యిందని బ్యాంకు మేనేజర్‌ డి.మధుసూదనరావు తెలిపారు. మంగళవారం శ్రీరాములు భార్య సూరీడుకు రూ.50 లక్షల చెక్కు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఇటీవల శ్రీరాములు చెట్టుపై నుంచి జారిపడి మృతి చెందారని, ఈయన శాలరీ ఖాతా తమ బ్యాంకులో ఉండడంతో ఆయన కుటుంబానికి ప్రమాద బీమా మంజూరైందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల ఎస్‌బీఐ శాలరీ, ఫెన్షన్‌ ప్యాకేజీలో అకౌంట్‌ కలిగి ఉంటే వారికి ప్రమాద బీమా వర్తిస్తుందన్నారు. కార్యక్రమంలో పూర్వపు బ్యాంకు చీఫ్‌ మేనేజర్‌ పి.సురేష్‌, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీలో చేరికలు

కంచిలి: మండలంలోని మఠం సరియాపల్లి పంచాయతీ పరిధి రాగుపురం గ్రామానికి చెందిన పలువురు టీడీపీ కార్యకర్తలు కూటమి పరిపాలనపై అసంతృప్తి కలగడంతో వైఎస్సార్‌సీపీ నాయకులతో కలిసి స్థానిక సర్పంచ్‌ కొణపల సురేష్‌ ఆధ్వర్యంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో సోమవారం చేరారు. వీరిని ఎంపీపీ పైల దేవదాస్‌రెడ్డి పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. వైఎస్సార్‌సీపీలో చేరినవారిలో బదకల ధర్మారావు, బుడ్డెపు కాళిదాసు, పిలక పురుషోత్తంలు ఉన్నారు. కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ సభ్యుడు బుడ్డెపు విశ్వనాథం, నేతలు గేదెల మాదాలు, బదకల ఢిల్లీరావు, దుబ్బ ఢిల్లీరావు, బదకల చిన్న దుర్యోధన, పిలక చిన్నయ్య పాల్గొన్నారు.

తప్పిన పెను ప్రమాదం

వజ్రపుకొత్తూరు రూరల్‌: మండలంలోని గరుడభద్ర సమీపంలో రాజాం – గరుడభద్ర రోడ్డుపై సోమవారం విద్యుత్‌ స్తంభం విరిగి నేలకొరిగింది. చినవంక గ్రామానికి చెందిన సాన కృష్ణ, పల్లిసారధి గ్రామానికి చెందిన ఉప్పరపల్లి రామారావు ఇద్దరూ కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే ఘటనలో వారిద్దరూ చిన్న చిన్న గాయాలతో బయటపడగా, ద్విచక్ర వాహనం నుజ్జుయినట్లు బాధితులు తెలిపారు. ఆ సమయంలో విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు. కాగా ఈ విద్యుత్‌ స్తంభాన్ని ప్రైవేట్‌ వ్యక్తులు అనాధికారికంగా ఏర్పాటు చేసినట్లు విద్యుత్‌ శాఖాధికారులు చెబుతున్నారు.

మృతదేహం లభ్యం

గార: మండలంలోని మొగదాలపాడు బీచ్‌లో గల్లంతైన పొందూరు మండలం కింతలి – ఖాజీపేట గ్రామానికి చెందిన అలబాన జగదీష్‌కుమార్‌(19) మృతదేహం లభ్యమైందని ఏఎస్‌ఐ తెలుగు చంద్రమోహన్‌ తెలిపారు. శనివారం జగదీష్‌ తన పుట్టిన రోజు సందర్భంగా తోటి స్నేహితులతో బీచ్‌కు వెళ్లి గల్లంతయ్యాడు. దీంతో మృతదేహాన్ని సోమవారం శ్రీకూర్మం– మత్స్యలేశం తీరంలో మత్స్యకారులు గమనించి సమాచారమందించారు. పోస్టుమార్టం చేసి, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

సోంపేటలో అగ్ని ప్రమాదం

సోంపేట: పట్టణంలోని చలపతి గోర్జి వీధిలో సోమవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో రూ.50 వేలు విలువ కలిగిన వస్తువులు కాలిపోయినట్లు స్థానికులు, అధికారులు తెలియజేశారు. అగ్నిమాపక అధికారులు, బాధితులు తెలిపిన వివరాల మేరకు.. పట్టణానికి చెందిన బత్తుల రుద్రయ్య అనే వ్యాపారి గోర్జి వీధిలో పెంకుటింటిని అద్దెకు తీసుకుని గృహోపకరణ వస్తువులు విక్రయించడానికి నిల్వ చేసి ఉన్నాడు. సోమవారం రాత్రి దీపావళి సందర్భంగా తారాజువ్వలు ఆ ఇంట్లో పడడంతో గృహోపకరణ వస్తువులు కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది వెంటనే చేరుకుని మంటలు అదుపులోకి తీసుకొచ్చారు.

రూ.50 లక్షల బీమా అందజేత 1
1/3

రూ.50 లక్షల బీమా అందజేత

రూ.50 లక్షల బీమా అందజేత 2
2/3

రూ.50 లక్షల బీమా అందజేత

రూ.50 లక్షల బీమా అందజేత 3
3/3

రూ.50 లక్షల బీమా అందజేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement