జీడి ఫ్యాక్టరీ దగ్ధం
పర్లాకిమిడి: గజపతి జిల్లా గుసాని బ్లాక్ లావణ్యగడ పంచాయతీ బోడోపద గ్రామం వద్ద జీడి ప్యాక్టరీ దీపావళి రాత్రి ఆకస్మికంగా దగ్ధం కావడంతో ఒక కోటి 70 లక్షల రూపాయల నష్టం వాటిల్లింది. ఫ్యాక్టరీ సంఘటన స్థలానికి వచ్చి ఫ్యాక్టరీ యజమాని బి.వి.జగన్నాథరావు తలుపులు తెరవడంతో ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం జగన్నాథరావు విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు గారబంద ఐఐసీ ప్రశాంత నిషిక తెలియజేశారు. ఐఐసి నిషిక సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం ఉదయం 9 గంటల సమయంలో లాబణ్యగడ సమీపంలో శ్రీజగన్నాథ్ కాష్యూ ఇండస్ట్రీస్ దీపావళి పర్వదినం పురస్కరించుకుని కొంచెం వేగంగా ఫ్యాక్టరీ బంద్ చేశారు. అక్కడకు రెండు గంటల తర్వాత ఆయనకు ఫ్యాక్టరీ తగలబడి పొగ వస్తోందని గ్రామస్తులు చెప్పడంతో ఆయన పలాస నుంచి లావణ్యగడ చేరుకుని గారబంద పోలీసు స్టేషన్, పర్లాకిమిడి అగ్నిమాపక దళంకు ఫోన్ చేశారు. సంఘటనా స్థలానికి అగ్నిమాపక దళం వచ్చి మంటలు ఆర్పడానికి ప్రయత్నం చేశారు. తగలబడిపోతున్న ఫ్యాక్టరీ తలుపులు అకస్మాత్తుగా ఫ్యాక్టరీ యజమాని జగన్నాథ రావు తెరవడంతో ఆయనకు మంటలు అంటుకుని ఒళ్లు కాలిపోయింది. యజమానిని వెంటనే విశాఖపట్నంలో ఒక ప్రైవేటు ఆసుపత్రికి స్థానికులు తరలించారు. అయితే ఫ్యాక్టరీలో జీడి బస్తాలు 1200, జీడితోక్కు బస్తాలు అధికంగా ఉండటంతో మంటలు ఆర్పలేక పోయారు. దాదాపు 15 గంటలు అగ్నిమాపక దళం ఫైర్ ఫైటింగ్ చేసిన ఉదయం పది గంటల వరకూ మంటలను అదుపులోకి తేలేకపోయారు. అగ్నికి ఆహుతైన శ్రీజగన్నాధ జీడి ఇండస్ట్రీకి దాదాపు రూ. కోటి 70 లక్షలు నష్టం వాటిల్లినట్టు జగన్నాథరావు బంధువులు తెలియజేశారు. దీనిపై గారబంద పోలీసు అధికారులు కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జీడి ఫ్యాక్టరీ దగ్ధం
జీడి ఫ్యాక్టరీ దగ్ధం


