యువతి ఆత్మహత్య
రాయగడ: స్థానిక గాంధీనగర్ నాలుగో లైన్‌లో ఉంటున్న యువతి సోమవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చే సుకుంది. ఈమెది జిల్లాలోని మునిగుడ పోలీస్ స్టేషన్ పరిధి నియాలి గ్రామానికి చెందిన లిజ పిడికక (20)గా పోలీసులు గుర్తించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పిడికక మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. లిజ పిడికక స్థానిక అటానమస్ కళాశాలలో డిగ్రీ ఫైనలియర్ చదువుతూ.. గాంధీనగర్‌లో అద్దె ఇంట్లో ఉంటుంది. ఈ క్రమంలో సోమవారం ఇంట్లో ఉరివేసుకుని చనిపోగా.. ఆత్మహత్యకు కా రణాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు.
బాలాసోర్‌లో బాణసంచా దుకాణం దగ్ధం
భువనేశ్వర్: బాలాసోర్‌లోని బాణసంచా దుకాణం దగ్ధమైంది. నిప్పు రవ్వలు తాకి పేలుడు సంభవించిందని ప్రత్యక్ష సాక్షుల కథనం. పేలుడు సంభవించిన కాసేపట్లో దుకాణం దగ్ధమైంది. ప్రజలు బెంబేలెత్తి పరుగులు తీశారు. బాలాసోర్ అజమాబాద్ కాలేజ్ రోడ్ ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. లక్షల రూపాయల విలువైన బాణాసంచా సామగ్రి మంటల్లో బూడిదగా మారింది. స్థానిక అగ్నిమాపక దళం రంగంలోకి దిగి మంటలను నివారించింది.
బాణసంచా పేలి స్కూటీ దగ్ధం
భువనేశ్వర్: డిక్కీలో బాణసంచా పేలడంతో స్కూటీ దగ్ధం అయింది. ఈ సంఘనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన కటక్ నగరం చౌలియాగంజ్ అపర్ణానగర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. స్కూటర్ నడుపుతున్న వ్యక్తితో సహా కూర్చున్న వ్యక్తి ఈ పేలుడులో తీవ్రంగా గాయపడ్డారు. వీరివురు కటక్ నగరం మఠ్ సాహికు చెందిన వారుగా గుర్తించారు. స్థానిక ఎస్‌సీబీ మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో చికిత్సం కోసం చేర్పించారు.
కారు ప్రమాదంలో బీఎస్‌ఎఫ్ జవాన్ మృతి
మల్కన్‌గిరి : మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి మోటు పోలీసుస్టేషన్ పరిధిలో ఆంధ్రా–ఒడిశా సరిహద్దు చింతూరులో మంగళవారం తెల్లవారుజామున జరిగిన కారు ప్రమాదంలో మల్కన్‌గిరి జిల్లా బలిమెల ప్రాంతంలో ఉన్న బీఎస్‌ఎఫ్ 142 బెటాలియన్ జవాను మృతి చెందాడు. కారులో ఉన్న మరో ఆరుగురు గాయపడ్డారు. సెలవులకు ఇళ్లకు వెళ్లి తిరిగి విధుల్లో చేరడం కోసం సోమవారం రాత్రి కొందరు జవాన్లు కారులో వస్తుండగా చింతూరు వద్ద కారు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో ముందు సీట్‌లో ఉన్న జవాన్ గౌరవ్ పాండే సంఘటన స్థలంలో మృతి చెందగా క్షతగాత్రులను చింతూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
యువతి ఆత్మహత్య
యువతి ఆత్మహత్య
యువతి ఆత్మహత్య


