ఘనంగా కాళీ పూజలు ప్రారంభం
రాయగడ: స్థానిక బ్లాక్ కాలనీ వద్ద ఫ్రెండ్స్ యూత్ అసొసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి నుంచి కాళీ పూజలు ప్రారంభమయ్యాయి. సమీపంలోని నాగావళి నది నుంచి శుద్ధ జలాలను తీసుకువచ్చి మండపంలో ఉంచడంతో పూజా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సోమవారం ఉదయం మా గురుతార పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పూజా పెండాల్ ఆకట్టుకుంటుంది. అదేవిధంగా మందిరం ప్రాంగణంలో వరహా సహీత లక్ష్మీ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ నెల 31వ తేదీ వరకు పూజలు జరుగుతాయని నిర్వాహకులు తెలియజేశారు.
గుణుపూర్‌లో..
గుణుపూర్‌లో కూడా దక్షాణ కాళీ పూజలు అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 19వ తేదీ నుంచి ప్రారంభమైన దక్షిణ కాళీ పూజలు ఈ నెల 27వ తేదీ వరకు కొనసాగుతాయి. మంగళవారం ఉదయం సూర్యపూజ, నవగ్రహ, దశమహా విద్య పూజలను నిర్వహించారు.
ఘనంగా కాళీ పూజలు ప్రారంభం
ఘనంగా కాళీ పూజలు ప్రారంభం
ఘనంగా కాళీ పూజలు ప్రారంభం


