సంప్రదాయ పోటీలు ప్రారంభం
జయపురం: ప్రాచీన సంప్రదాయ సంస్కృతి, కళలు, నృత్య సంగీతాల పరిరక్షణ కోసం నెలకొల్పిన జయపురం తరుణ ప్రజ్ఞా భారతి–2025 వార్షికోత్సవాల పోటీలు ఆదివారం ప్రారంభమయ్యాయి. స్థానిక ఎన్‌కేటీ రోడ్డు నారాయణి ఆంగ్ల పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో యోగ గురువులు జానకీ పాణిగ్రహి, కృష్ణారావు దొరలు ఉత్కళ ఆరాధ్య దైవం శ్రీజగన్నాథునికి దీప ప్రజ్వలన చేసి ప్రారంభోత్సవం చేశారు. సూర్య నమస్కారాలతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలోయోగాసనాలు, శంఖనాథం, హుళి హుళి శబ్ధాలు, భారతీయ సంస్కృతిపై వక్తృత్వ, గీత శ్లోకాల పఠనం పోటీలు నిర్వహించారు. జయపురం తరుణ ప్రజ్ఞాభారతి అధ్యక్షుడు తపన కుమార్ త్రిపాఠీ మాట్లాడుతూ మన ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలు కళలు క్రీడలు పరిరక్షణ కోసం డాక్టర్ గంగాధర నందో తరుణ ప్రజ్ఞా భారతిని స్థాపించారని, ఆయన ఆశయాల మేరకు ఏటా సంప్రదాయాలపై పోటీలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో ప్రజ్ఞా భారతి ఉపాధ్యక్షులు రామశంకర షొడంగి, కార్యదర్శి అజయ కుమార్ మల్లిక్, సహాయ కార్యదర్శి సువర్ణ ఖిళో, కోశాధికారి రవీంద్ర మహరాణలతో పాటు సబిత త్రిపాఠఋ, తపశ్విణీ కుమారీ సాహు, లిపికా దొలాయి, రీతాంజళి డాకువ, జి. మహేష్, జగన్నాఽథ్ పాణిగ్రహిల సహకారంతో నిర్వహించిన పోటీల్లో న్యాయ నిర్ణేతగా మనోజ్ మిశ్ర, క్షీరోద్ సాహు, మృత్యంజయ సాహు, సంజుక్త రౌత్ పాల్గొన్నారు.
సంప్రదాయ పోటీలు ప్రారంభం
సంప్రదాయ పోటీలు ప్రారంభం


