ఆర్‌పీఎఫ్ ఆపరేషన్ సేవ
రాయగడ: స్థానిక రైల్వే స్టేషన్‌లో ఆర్‌పీఎఫ్ సిబ్బంది ఆపరేషన్ సేవలో భాగంగా గర్భిణి ప్రయాణికురాలికి సకాలంలో ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స కోసం తరలించి తమ ఔదర్యాన్ని చాటుకున్నారు. వివరాల్లొకి వెళితే... శనివారం కొరాపుట్ నుంచి భువనేశ్వర్ హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్‌లో గర్భిణి నేహానాగ్ తన భర్తతో కలిసి కొరాపుట్ నుంచి బయలు దేరారు. హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్‌లోని ఏ–1 కోచ్‌లొ బెర్త్ నంబర్ 49లో ప్రయాణిస్తున్న ఆమెకు ప్రసవ నొప్పులు రావడంతో వాట్సాప్ మెసేజ్ ద్వారా ఆమె భర్త తహీర్ అహ్మద్ రైల్వే ఆపరేషన్ సేవకు సమాచారం అందించారు. దీనిపై స్పందించిన రైల్వే (విశాఖపట్నం) అధికారులు రాయగడ రైల్వే ఆర్‌పీఎఫ్ సిబ్బందికి తెలియజేశారు. రాయగడకు శనివారం రాత్రి 11.20 గంటలకు ఒకటో ప్లాట్‌ఫాంకు చేరుకుంది. అప్పటికే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి ఏడీఎం డాక్టర్ ఎల్.ఎన్.స్వయి, వైద్య సిబ్బందితో వద్ద వేచిఉన్న ఆర్‌పీఎఫ్ సిబ్బంది గర్భిణిని ట్రైన్ నుంచి కిందకు దింపారు. అనంతరం వైద్య సిబ్బంది పరీక్షించిన వెంటనే ఆమెను ఆస్పత్రికి చేర్పించాలని సూచించడంతో అంబులెన్స్ సహాయంతోకు తరలించారు.
ఆర్‌పీఎఫ్ ఆపరేషన్ సేవ


