నవభారత నిర్మాణంలో..ఆర్‌ఎస్‌ఎస్‌ది కీలక పాత్ర
కొరాపుట్: నవ భారత నిర్మాణంలో రాష్ట్రీయ స్వయం సేవక్‌ది కీలక పాత్ర అని పశ్చిమ ఒడిశా ఫిజికల్ ఇన్‌స్ట్రక్టర్ హరేకృష్ట మజ్జి పేర్కొన్నారు. ఆదివారం నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రంలో ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాలలో పాల్గొని ప్రసంగించారు. స్వాతంత్య్రం ముందు నుంచి హిందూ ఐక్యత కోసం ఆర్‌ఎస్‌ఎస్ పోరాటం చేసిందన్నారు. మనకు బయట ఎవరూ శత్రువులు లేరన్నారు. మనలో ఐక్యత లేక పోవడంతో అదే శత్రువుగా మారిందన్నారు. ప్రతి వ్యక్తి సామాజిక ఐక్యతతో ఉండాలన్నారు. సొంత కుటుంబంతో ప్రేమ, ఆప్యాయతలతో గడపాలన్నారు. ప్రభుత్వం ఆస్తి, ప్రజల ఆస్తి అని గుర్తించాలన్నారు. పన్నులు, విద్యుత్ బిల్లులు, ఇతర ప్రభుత్వ చెల్లింపులు దేశభక్తితో జరగాలన్నారు. ప్రతి వ్యక్తి మెక్కలు నాటడం, కాలుష్య వ్యతిరేక పోరాటం చేయాలన్నారు. సమాజంలో నాణ్యమైన విలువులతో సంభాషణలు చేయడం అవసరమన్నారు. మాతృ భాష, స్వదేశీ ఉత్పత్తుల వినియోగం అలవాటుగా మారాలన్నారు. ఈ సందర్భంగా రెండు వేల మంది ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు తమ సంప్రదాయ దుస్తులు ధరించి భారీ ప్రదర్శన చేశారు. ఈ ర్యాలీ చమిరియాగుడ నుంచి మజ్జి గుడ జంక్షన్ వరకు సాగింది. బీజేపీకి చెందిన నబరంగ్‌పూర్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి సాధారణ ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలా ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నబరంగ్‌పూర్ జిల్లా సర్ సంఘచాలక్ జుదిష్ట గోండో, ప్రత్యేక పరిశీలకుడు ఎస్.సుబ్రహ్మణ్యం (రాజమండ్రి), తదితరులు పాల్గొన్నారు.
నవభారత నిర్మాణంలో..ఆర్‌ఎస్‌ఎస్‌ది కీలక పాత్ర
నవభారత నిర్మాణంలో..ఆర్‌ఎస్‌ఎస్‌ది కీలక పాత్ర


