‘మట్టి ప్రమిదలు వాడుదాం’
జయపురం: దీపావళికి ప్రకృతికి నష్టం వాటిల్లకుండా చూసుకుందామని జయపురం సిటీ ఉన్నత పాఠశాల ఎకో క్లబ్బు విద్యార్థులు కోరుతున్నారు. మట్టి దీపాలు వెలిగించి ఘనంగా దీపావళి జరుపుకోవాలని కోరుతూ ఓ ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. వారు స్వయంగా మట్టి దీపాలు (ప్రమిదలు) తయారు చేస్తూ వాటిని ప్రజలకు చూపి మట్టి దీపాలు వెలిగించాలని ఉద్బోధిస్తున్నారు. మట్టి దీపాలు ఎలా తయారు చేయాలో స్థానిక మట్టి వస్తువులు తయారు చేసే గోప సుందర పాణిగ్రహి సిటీ ఉన్నత పాఠశాల సెక్యూరిటీ గార్డు సునీల భొత్రలు ఎకో క్లబ్బు సభ్యులకు వివరించి వారిచే స్వయంగా చేయించారు. దీపావళిని ప్రతి విద్యార్థి మట్టి దీపాలతోనే ఇంటిలో జరుపుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమం ఎకో క్లబ్బు ఉపాధ్యాయులు ప్రతాప్ కుమార్ పట్నాయిక్, సిటీ ఆంగ్ల పాఠశాల ప్రిన్సిపాల్ సుధాకర పట్నాయిక్ నిర్వహిస్తున్నారు.
ఘనంగా సురభి మహోత్సవం
‘మట్టి ప్రమిదలు వాడుదాం’
‘మట్టి ప్రమిదలు వాడుదాం’


