శ్రమదానం
పర్లాకిమిడి: పాతపట్నం రోడ్డులో మహేంద్రతనయ నది వద్ద ఉన్న శ్మశాన వాటికను గ్రీన్ ఎర్త్, జిల్లా యంత్రాంగం, గాయత్రీ పరివార్ కలిసి ఆదివారం ఉదయం శుభ్రం చేశారు. దీపావళి పురస్కరించుకుని పలువురు పితృకర్మలు మహేంద్ర తనయ నది వద్ద చేస్తారు. మహేంద్రతనయ ఒడ్డున ఉన్న శ్మశానవాటిక వద్ద పేరుకుపోయిన పిచ్చి మొక్కలు, బూడిద తొలగించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనింగ్ అధికారి దిపేన్ పోరిడా, ఆదర్శ పోలీసు స్టేషన్ ఎస్‌ఐ ప్రపుల్ల జగదానంద, పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేష్‌కుమార్ మిశ్రా, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జితేంద్ర పట్నాయక్, కార్యదర్శి ఎం.పృఽథ్వీరాజ్, గాయత్రీ పరివార్‌కు చెందిన మనోజ్ దాస్, సంతోష్ గంతాయత్, తదితరులు పాల్గొన్నారు.


