యోగాతో మానసిక ఉల్లాసం
పర్లాకిమిడి: గజపతి జిల్లా వాకర్స్ క్లబ్ వార్షికోత్సవం, ప్రపంచ మానసిక స్వస్థ్య దినోత్సవం సందర్భంగా శ్రీధర్‌నగర్‌లో ఆదివారం సి.సి.డి స్వచ్ఛంద సంస్థ కార్యాలయంలో పతంజిలి యోగా సభ్య బృందానికి మానసిక ఆరోగ్య సూత్రాలను జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి మానసిక వైద్యులు ప్రాణ్ రంజన్ నాయక్ తెలియజేశారు. మానసిక రోగులు ఎలా ప్రవర్తిస్తారు, వారి రోగ లక్షణాలు, ఉపశమనం గురించి తెలియజేశారు. యోగా క్రమం తప్పకుండా అభ్యసించడం వల్ల కోన్ని మానసిక రుగ్మతలు తగ్గుతాయన్నారు. ఈ కార్యక్రమంలో మానసిక వైద్యులు సతీష్ కుమార్ మహాపాత్రో, జతిన్ పట్నా, ప్రదీప్ కుమార్ మహాపాత్రో, తదితరులు పాల్గొన్నారు.


