
ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో.. బొరిగుమ్మ యువతి
జయపురం: జయపురం సబ్‌డివిజన్ బొరిగుమ్మ యువతి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ 2025లో స్థానం సంపాదించింది. ఇంగ్లీష్ పుస్తకాలు రచించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం పొంది అందరి ప్రశంసలు పొందుతోంది. యువతి బొరిగుమ్మ సమితి నువాగాం గ్రామంలో ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో విశ్రాంత ఉపాధ్యాయులు ఎన్.రాజేష్ కుమార్, గాయత్రీల కుమార్తె ఎన్.త్రిషా తన్య. త్రిషా 19 ఏళ్ల వయసులో ‘ఎ నోట్ వాట్ ఐ థాట్’, ‘సెంటిమెంట్స్ ఆఫ్ ఎడల్‌సెంట్’, ‘డిజైన్ డెజిరబుల్ డిపిక్షన్’ పుస్తకాలను ఇంగ్లీష్‌లో రచించింది. ఆ రచనలకు సంతృప్తి చెందిన ఇండియా బుక్ ఆఫ్ రికార్డు వారు ఆ బాలిక ప్రతిభకు మెచ్చి రికార్డ్స్‌లో స్థానం కల్పించి ప్రశంసా పత్రం, మెడల్, ఇండియ బుక్ ఆఫ్ రికార్డ్స్ పుస్తకం, పెన్, బ్యాడ్జ్, గుర్తింపు కార్డ్‌తో సన్మానించారు. ఎన్.త్రిషా తన్య జయపురం విక్రమదేవ్ విశ్వ విద్యాలయలో +3లో ఆఖరి సంవత్సర చదువుతోంది. భవిష్యత్తులో తాను మరికొన్ని పుస్తకాలు ఆంగ్లంలో రాయనున్నట్లు త్రిషా వెల్లడించింది. ఆమెను తోటి విద్యార్థులు, స్నేహితులు, బంధువులు, బొరిగుమ్మ ప్రజలు అభినందించారు. మరిన్ని పుస్తకాలు రచించి మంచి ఆంగ్ల రచయితగా పేరు తెచ్చుకోవాలని ఆకాక్షించారు.