పర్లాకిమిడి: మనస్సు ప్రశాంతంగా ఉంచుకుంటే మనకు ఎటువంటి అనారోగ్యాలు, చెడు ఆలోచన, వ్యసనాలు దరికి చేరవని ప్రభుత్వ మెడికల్ సిబ్బంది ప్రసన్న రంజన్ నాయక్ అన్నారు. స్థానిక శ్రీకృష్ణచంద్ర గజపతి కళాశాలలో రాజగురు పతంజలి రాందేవ్ బాబా యోగా శిబిరంలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవంలో పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు చెడువ్యసనాలకు బానిసై నేరాలకు అలవాటు పడుతున్నారని ప్రసన్న రంజన్ నాయక్ అన్నారు. యోగా వల్ల మానసిక ప్రశాంత పొందవచ్చన్నారు. అక్టోబర్ 11 నుంచి నెలరోజుల పాటు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా శిబిరాలు ఏర్పాటుచేస్తున్నామని సతీష్ కుమార్ మహాపాత్రో అన్నారు. ఈ శిబిరంలో జతిన్ పట్నా, ప్రదీ కుమార్ మహాపాత్రో, పతంజలి యోగా శిబిరం గురువు కె.సూర్యనారాయణ, సురేంద్ర కుమార్ రథ్, ఇతర యోగా శిక్షకులు పాల్గొన్నారు.
రాణిపేట గ్రామంలో...
కాశీనగర్ బ్లాక్ రాణిపేట గ్రామంలో ఉన్న నియాతి మానసిక వికలాంగుల విద్యార్థుల పాఠశాలలో జిల్లా కోర్టు న్యాయ సేవా ప్రాధికరణ అధికారి బిమల్ రవులో పాల్గొని ప్రపంచ మానసిక ఆరోగ్యం దినోత్సవంపై మాటాల్డారు. ఈ కార్యక్రమంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేష్‌కుమార్ మిశ్రా, జిల్లా నియాతి స్కూల్ అధ్యక్షురాలు స్వయంలతా పాణిగ్రాహి, తనూజా శతపథి తదితరులు పాల్గొని మాట్లాడారు.
యోగాతో మానసిక ప్రశాంతత
యోగాతో మానసిక ప్రశాంతత