
11 అడుగుల కొండచిలువ పట్టివేత
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి టెల్‌రాయి పంచాయతీ ఎం.వి.107 గ్రామంలో 11 అడుగుల కొండచిలువను పట్టుకున్నారు. శనివారం రాత్రి గ్రామానికి చెందిన సురెం గుప్తా వ్యక్తి ఇంటి పెరట్లోని అరటి చెట్టు వద్ద ఉన్న పామును పక్కింటి మహిళ చూసి కేకలు వేసింది. దీంతో సురెం గుప్తా కలిమెల స్నేక్‌హైల్ప్ లైన్ సభ్యుడు రాకేష్ హల్ద్‌ర్‌కు సమాచారం ఇవ్వడంతో ఆయన తన సహచారుడుతో వచ్చి కొండచిలువను పట్టుకున్నారు. అటవీశా ఖ సిబ్బంది సూచన మేరకు ఆదివారం ఉదయం ఎం.వి.126 గ్రామ అడవిలో విడిచిపెట్టారు.