
గురువులదే గురుతర బాధ్యత
జయపురం: సమాజ నిర్మాణంలో గురువులదే గురుతర బాధ్యత అని స్థానిక విక్రమదేవ్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ మహేశ్వర చంద్ర నాయక్ అన్నారు. వర్సిటీ ఉపాధ్యాయ శిక్షణ(బీఈడీ) విభాగం నిర్వహించిన బీఈడీ ప్రథమ సంవత్సర విద్యార్థుల ఫ్రెషర్స్ డే వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయ శిక్షణ పొందిన తర్వాత విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్ది సమాజానికి అందించాలని సూచించారు. స్నాతకోత్తర పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ ప్రశాంత కుమార్ పాత్రో వర్సిటీ ఉపాధ్యాయుల శిక్షణా విభాగం నిర్వహిస్తున్న భూమికను ప్రశంసించారు. ఉపాధ్యాయ శిక్షణ విభాగ ప్రధాన అధికారి డాక్టర్ మనోరంజన్ ప్రదాన్ మాట్లాడుతూ.. విద్యార్థులు అధ్యాపకులుగా ఎదిగేందుకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ లోకేష్ ప్రధాన్, కస్తూరీ ఆచార్య, అనిత పట్నాయిక్ తదితరులు పాల్గొన్నారు.

గురువులదే గురుతర బాధ్యత