
సీనియర్ సిటిజన్లకు గుర్తింపు కార్డులు
జయపురం: పట్టణంలోని సీనియర్ సిటిజన్లు దరఖాస్తు చేసుకుంటే పోలీసు యంత్రాంగం సీనియర్ సిటిజన్ గుర్తింపు కార్డులు సమకూర్చుతుందని జయపురం పట్టణ పోలీసుస్టేషన్ అధికారి ఉల్లాస్ చంద్ర రౌత్ తెలియజేశారు. స్థానిక జేఈఎన్‌సీ చర్చి సభాగృహంలో పట్టణ పోలీసులు అమో పోలీసు సమితి మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మద్యం సేవించి రాత్రి సమయాల్లో రచ్చ చేసేవారిపై పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. సంఘ వ్యతిరేక ఘటనలు జరిగినప్పుడు సమాచారం ఇచ్చినవారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. పట్టణంలో నేరాలు నియంత్రించేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్‌ఐలు సిద్దాంత బెహర, రుచికాంత మహాకురమ్, నవీన చంద్ర చౌదరి, ఆర్.పంగి, ఏఎస్‌ఐలు సత్యబాది నాయక్, డీపీ పండ, కేసీహెచ్ మిశ్ర, సపన్ కుమార్ మిశ్ర తదతరులు పాల్గొన్నారు.

సీనియర్ సిటిజన్లకు గుర్తింపు కార్డులు