
వివాహిత అనుమానాస్పద మృతి
రాయగడ:
జిల్లాలోని గుణుపూర్ ఆదర్శ పోలీస్‌స్టేషన్ పరిధి డొంబొసర గ్రామంలో ఒక వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది. మృతురాలు అదే గ్రామానికి చెందిన రంజిత త్రిపాఠి (32)గా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గుణుపూర్ సబ్ డివిజన్ హాస్పిటల్‌కు తరలించారు. అయితే మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. గుణుపూర్ ఆదర్శ పోలీస్‌స్టేషన్ ఐఐసీ కేకేబికే కుహరో తెలియజేసిన వివరాల ప్రకారం.. డొంబొసొర గ్రామానికి చెందిన నరసింహ త్రిపాఠితో 2007వ సంవత్సరంలో రంజితకు వివాహం జరిగింది. అయితే పెళ్లి జరిగినప్పటి నుంచి రంజితకు అత్తవారింట్లో వేధింపులు కొనసాగుతుండేవని ఆరోపిస్తున్నారు.