
జాతీయస్థాయి షూటింగ్‌లో గోల్డుమెడల్
● సెంచూరియన్ పబ్లిక్ స్కూల్ విద్యార్ధినీ
అసమాన ప్రతిభ
పర్లాకిమిడి: అఖిల భారత థాల్ సైనిక్ క్యాంపు 2025 పోటీలలో సెంచూరియన్ పబ్లిక్ స్కూల్‌లో తోమ్మిదవ తరగతి చదువుతున్న మౌసమీ సిమలాయి (14)కు జాతీయ స్థాయి రైఫిల్ షూటింగ్‌లో గోల్డు మెడల్ సాధించి గజపతి జిల్లాకు ఖ్యాతి తెచ్చింది. మౌసమీ సిమలాయి గజపతి ష్టేడియం వద్ద చేపలు అమ్ముకునే మోనికా, బలాఐ చంద్ కూతురు. స్థానిక 14 వార్డు సంజయ్ గాంధీ కాలనీలో వుంటున్న ఆమె తల్లిదండ్రులు ఆర్థికంగా వెనుకబడినా కూతురు మౌసమీని సెంచూరియన్ పబ్లిక్ స్కూల్‌లో చేర్పించారు. ఎన్.సి.సి.క్యాడెట్ల రైఫిల్ షూటింగ్ న్యూ ఢిల్లీ థాల్ సైనిక్ క్యాంపు సెప్టెంబరు 2 నుండి 11 వరకూ జరిగాయి. ఈ పోటీలకు దేశ వ్యాప్తంగా 17 ఎన్.సి.సి.డైరక్టరీస్‌లలో, 1546 మంది క్యాడెట్లు న్యూఢిల్లీ థాల్ సైనిక్ క్యాంపులో పాల్గోన్నారు. వారిలో 1200 మంది గర్‌ల్స్ జూనియర్ వింగ్ రైఫిల్ షూటింగులో మౌసమీ సిమలాయి సెంచూరియన్ పబ్లిక్ స్కూల్ ద్వారా పోటీలలో పాల్గోని అసమాన ప్రతిభ చూపి గోల్డు మెడల్ సాధించింది. ఆమె విజయం పట్ల సెంచూరియన్ వర్శిటీ ఉపాధ్యక్షులు ఆచార్య డి.ఎన్.రావు, ప్రిన్సిపల్ సునీతా పాణిగ్రాహి, వర్శిటీ రిజిష్ట్రారు డా.అనితాపాత్ర్, డైరక్టర్ దుర్గాప్రసాద్ పాఢి, ప్రాంతీయ సంచాలకులు సంబిత్ పాత్రోలు అభినందనలు తెలిపారు.