
వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై మార్కెట్ కమిటీ చైర్మన్ దాడ
జలుమూరు: శ్రీముఖలింగంకు చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త చింతం రాంబాబుపై జలుమూరు మార్కెట్ కమిటీ చైర్మన్ తర్ర బలరాం, సోదరుడు కృష్ణ గురువారం దాడి చేసి గాయపరిచారు. బాధితుడు తెలిపిన వివరాలు ప్రకారం.. గతంలో రాంబాబు తన వీధిలో వైఎస్సార్ సీపీ బ్యానర్ కట్టగా బలరాం తొలగించేందుకు ప్రయత్నించాడు. అప్పట్లో అది వివాదంగా మారింది. పాత కక్షల నేపథ్యంలో గురువారం శ్రీముఖలింగంలో వేరే గొడవ జరుగుతుండగా అదే చోటకు వచ్చి తనపై దాడి చేశారని, కర్రతో తలపై బలంగా కొట్టారని రాంబాబు ఆరోపించారు. దీనిపై జలుమూరు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అనంతరం బుడితి సీహెచ్‌సీలో చికిత్స తీసుకున్నానని పేర్కొన్నారు. జూలైలో ఇదే మార్కెట్ కమిటీ చైర్మన్ బలరాంతోపాటు మరి కొందరు సామాజిక కార్యకర్త, అర్చకుడు నాయుడుగారి రాజశేఖర్‌పై కూడా దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో పోలీసులు సరిగా వ్యవహరించకపోవడంతో రాజశేఖర్ ఢిల్లీ వెళ్లి మానవ హక్కుల కమిషన్‌తో పాటు రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. ఇది విచారణలో ఉండగా మళ్లీ ఈ గొడవ జరగడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాంబాబు ఫిర్యాదుపై జలుమూరు ఎస్.ఐ అశోక్‌బాబు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.