
గంజాయితో ఇద్దరు అరెస్టు
పలాస: ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులు పర్లాకిమిడి నుంచి బస్సులో గంజాయితో వచ్చి కాశీబుగ్గ బస్టాండ్‌లో బుధవారం దిగారు. అక్కడి నుంచి పలాస రైల్వే స్టేషన్‌కు వెళ్తుండగా కాశీబుగ్గ ఎస్‌ఐ నర్సింహమూర్తి అనుమానంతో తనిఖీ చేశారు. అందులో 10.815 కిలోల గంజాయిని గుర్తించడంతో వెంటనే అరెస్టు చేసి గంజాయిని సీజ్ చేసినట్లు కాశీబుగ్గ డీఎస్పీ వెంకట అప్పారావు గురువారం విలేకరులకు తెలియజేశారు. అరెస్టయిన వారిలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అల్గాపూర్‌కు చెందిన రోహిత్, ఉన్నా జిల్లాకు చెందిన నూర్ దీన్ ఉన్నారు. వీరు ఒడిశారాష్ట్రం బడగర్త్ బిట్ కాలనీ చెందిన సుమన్ మానిక్ నుంచి గంజాయి తెచ్చారని చెప్పారు. విలేకరుల సమావేశంలో ఎస్‌ఐ నర్సింహమూర్తి, సిబ్బంది పాల్గొన్నారు.