
విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
మందస: బుడార్సింగి పంచాయతీ కొరడాలు గ్రామానికి చెందిన సీర రమేష్(35) గురువారం తన ఇంట్లో టేబుల్ ఫ్యాన్ రిపేర్ చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మందస ఎస్‌ఐ కె.కృష్ణప్రసాద్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
యువకుడు ఆత్మహత్య
ఎచ్చెర్ల : ఇబ్రహీంబాద్ గ్రామానికి చెందిన సీపాన రామకృష్ణ (27) అలియాస్ రాకీ అనే యువకుడు గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఎచ్చెర్ల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంటర్ వరకు చదివిన రామకృష్ణ శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు సంస్థ వద్ద సెక్యూరిటీ గార్డు ఉద్యోగం చేస్తున్నాడు. కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకున్నారు. తల్లి లక్ష్మీ వ్యవసాయ పనుల నుంచి తిరిగి ఇంటికి వచ్చే సమయానికి కుమారుడు ఫ్యాన్‌కు వేలాడుతూ విగతజీవిగా కనిపించడంతో బోరున విలపించింది. రామకృష్ణ తండ్రి జగన్నాథం పదిహేనేళ్ల క్రితం నుంచి ఇంటినుంచి వెళ్లిపోయి తిరిగి రాలేదు. తల్లి అన్నీ తానై కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. రామకృష్ణ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. ఎచ్చెర్ల ఎస్సై వి.సందీప్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జాతీయ లోక్ అదాలత్ రేపు
శ్రీకాకుళం పాతబస్టాండ్: జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు రాజీ అయ్యేలా చూడాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జునైద్ అహ్మద్ మౌలానా సూచించారు. ఈ సందర్భంగా ఆయన గురువారం ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. 13న జరగనున్న అదాలత్‌లో రాజీకి అనువైన క్రిమినల్, సివిల్, మోటారు ప్రమాదాలు, ప్రీ లిటిగేషన్ కేసులను ఇరు పక్షాల అంగీకారంతో పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. కక్షిదారులు ఎలాంటి విభేదాలు లేకుండా సఖ్యతతో సమస్యలను ముగించుకోవాలని సూచించారు. భావోద్వేగాలకు లోనుకాకుండా, సత్ప్రవర్తనతో ముందుకు సాగాలని అన్నారు. జిల్లా వ్యాప్తంగా న్యాయస్థానాల్లో ఈ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని, అందువల్ల ప్రజలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జడ్జి కోరారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు కూడా ఉన్నారు.

విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి