
ధర్మాన సావిత్రమ్మకు నివాళులు
శ్రీకాకుళం రూరల్/పోలాకి: ధర్మాన సోదరుల మాతృమూర్తి ధర్మాన సావిత్రమ్మ 13వ వర్ధంతి కార్యక్రమం పెదపాడు పరిధిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో గురువారం నిర్వహించారు. సావిత్రమ్మ చిత్రపటం వద్ద కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. అనంతరం షణ్ముఖప్రియ, హరిప్రియ సిస్టర్స్ శాసీ్త్రయ సంగీత కచేరి నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాధరావు, మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్సీలు పాలవలస విక్రాంత్, నర్తు రామారావు, జిల్లా పరిషత్ చైర్మన్ పిరియా విజయ, వైఎస్సార్ సీపీ యువనాయకులు ధర్మాన రామ్‌మనోహర్‌నాయుడు, మాజీ ఎమ్మెల్యేలు కంబాల జోగులు, గుండ లక్ష్మీదేవి తదితరులు న్నారు. అంతకుముందు పోలాకి మండలం మబగాంలోని ధర్మాన సావిత్రమ్మ స్మృతివనంలో సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు. కుమారులు కృష్ణదాస్, ప్రసాదరావు, రాందాస్, కుటుంబసభ్యులు పాల్గొన్నారు.

ధర్మాన సావిత్రమ్మకు నివాళులు