
రైతు సమస్యలపై వినతి
పర్లాకిమిడి:
గజపతి జిల్లాలో రైతాంగం ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై జిల్లా అదనపు మాజిస్ట్రేట్ ఫల్గుని మఝికి బుధవారం నవనిర్మాణ్ కృషక్ సంఘటన్ రాష్ట్ర కోఆర్డినేటరు శేష దేవ్ నోందో, రంజిత్ పట్నాయక్ బుధవారం వినతిపత్రం అందజేశారు. నవనిర్మాణ్ కృషక్ సంఘటన్ సభ్యులు ప్రభాత్ మహాలిక, దండాసి ఖండువాల్, రంజిత్ పట్నాయక్‌లు సబ్ కలెక్టర్‌తో భేటీ అయ్యారు. జిల్లాలో యూరియా కోరత, నల్లబజారకు తరలింపు, పత్తిపంటకు మండీల ఏర్పాటు, అన్ని సమితి కేంద్రాల్లో శీతల బండారాలు నిర్మాణం, పంట పొలాలకు సాగునీరు, వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్ వంటి పలు సమస్యలు పరిష్కరించాలన్నారు. రైతులు ఎదుర్కుంటున్న సమస్యలపై అధికారులు, ప్రభుత్వం ప్రతిస్పందించకుంటే గజపతి జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు తీవ్రతరం చేస్తామన్నారు.