
5 గంటలు శ్రమించి..పొట్టలో దిగిన బాణం తొలగింపు
● కొరాపుట్ జిల్లా కేంద్రంలోని సాహిద్ లక్ష్మణ్ నాయక్ ప్రభుత్వ వైద్య
కళాశాలలో శ్రస్తచికిత్స
కొరాపుట్: పొట్టలో దిగిన బాణాన్ని వైద్యులు తొలగించారు. మల్కన్‌గిరి జిల్లా మత్తిలి సమితి పొకనాగుడ గ్రామ పంచాయతీ నాయక్‌గుడ గ్రామానికి చెందిన లక్ష్మణ్ గౌడ అటవీ ప్రాంతం నుంచి ఇంటికి తిరిగి వస్తున్నాడు. అదే సమయంలో అతని తమ్ముడు విశ్వనాథ్ గౌడ తమ సంప్రదాయ విల్లుతో ఆ ప్రాంతంలో సంచరిస్తున్నాడు. సరదాగా విల్లు నుంచి బాణం విడిచిపెట్టాడు. అది నేరుగా లక్ష్మణ్ గౌడ పొట్టలో దిగింది. వెంటనే స్థానికులు బాధితుడిని మత్తిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇక్కడి వైద్యుల సూచనతో బాధితుడిని కొరాపుట్ జిల్లా కేంద్రంలోని సాహిద్ లక్ష్మణ్ నాయక్ ప్రభుత్వ వైద్య కళాశాలకు తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్ అభిషేక్ పాత్ర, సర్జరీ విభాగాధిపతి మియొంజయ్ మల్లిక్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ గోపాల్ నాయక్ బృందం సుమారు 5 గంటలపాటు చేసిన శాస్త్ర చికిత్సతో బాణం పొట్టనుంచి బయటకు తీశారు. బాణం 8 అంగులాలు పొట్టలో చొచ్చకుపోయింది. అనేక చోట్ల పేగులు కత్తిరించబడ్డాయి. శరీరం నుంచి ఒకటిన్నర లీటర్ రక్తం బయటకుపోయింది. వైద్యుల కృషితో శస్త్ర చికిత్స విజయవంతం అయింది. డాక్టర్ల బృందానికి బాధిత కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది.

5 గంటలు శ్రమించి..పొట్టలో దిగిన బాణం తొలగింపు

5 గంటలు శ్రమించి..పొట్టలో దిగిన బాణం తొలగింపు